Health

Free Medical Camp (ఉచిత వైద్య శిభిరం)

*రాజమహేంద్రవరం:-* స్థానిక సుబ్బారావు నగర్ 49వ వార్డు మున్సిపల్ హైస్కూల్ నందు MN చారిటీ ఆద్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు....ఈకార్యక్రమానికి రోగులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.... దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వృద్ధులకు ప్రత్యేక వైద్యం అందించారు.... MN చారిటీ వ్యవస్థాపకులు MNVSS సాయిబాబా మాట్లాడుతూ వాతావరణ మార్పులతో ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని వాటిని నిర్మూలించే సదుద్దేశంతో తమ వంతుగా రానున్న రోజుల్లో గ్రామీణ మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు...ఈ కార్యక్రమంలో MN చారిటీ సభ్యులు చింతం వీరబాబు, మెండా శివ ప్రసాద్ .... రాజమండ్రి లో గల S R TRUST HOSPITAL వైద్య బృందం డా పిళ్ళారి శెట్టి శశాంక్MD , డా తేతలి వెంకట రామ రెడ్డి MS ORTHO డా.పవన్ కిషోర్, డా. శంకర్, డా.విష్ణు, డా.ఫరూక్, డా.గౌతమ్, బంటి, గంగరాజు, హరీష్, బద్రి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ccc ఎండి పంతం కొండలరావు గారు 48 వ వార్డ్ మాజీ కార్పొరేటర్ అజ్జారపు వాసు అతిథులు గా విచ్చేశారు.